పోలీసుల ఆకస్మిక తనిఖీలు
చర్ల/ఇల్లెందు/ఇల్లెందు రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 23వరకు నిరసన వారం, 24న దేశవ్యాప్త బంద్ పాటించాలని పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చర్ల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ సెంటర్, పెట్రోల్‌బంక్ సెంటర్, లక్ష్మీకాలనీ, కలివేరు క్రాస్, ఆర్.కొత్తగూడెం, కుదునూరు తదితర గ్రామాల్లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్‌తో పాటు సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, ఇల్లెందు జగదాంబసెంటర్‌లో సీఐ సురేశ్ నేతృత్వంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాక ఇల్లెందు మండలంలోని ఇల్లెందు – గుండాల ప్రధాన రహదారిపై గుండాల సీఐ రవీందర్, కొవరారం ఎస్సై నాగుల్‌మీరా ఆధ్వర్యాన తనిఖీలు న చేపట్టి అనుమానితుల వివరాలు ఆరా తీశారు.
మావోల బంద్ పిలుపుతో అప్రమత్తత
పోలీసుల ఆకస్మిక తనిఖీలు


