
తెలంగాణ బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు
మణుగూరురూరల్: బీసీ రిజర్వేషన్ అమలుపై 18న బీసీ సంఘాలు నిర్వహించే తెలంగాణ బంద్‌కు బీఆర్‌ఎస్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని పేర్కొన్నారు. బీసీ సంఘాలు చేస్తున్న బంద్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
రాళ్లతో దాడి చేసిన
వ్యక్తిపై కేసు
పాల్వంచ: గొడవ జరుగుతుందనే సమాచారంతో వెళ్లిన కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడగా.. గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో డయల్ 100 గొడవ జరుగుతున్నట్లు కాల్ రాగా.. కానిస్టేబుల్ అబ్బురాములు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ జట్‌పట్ రమేశ్ మద్యం సేవించి సదరు కానిస్టేబుల్‌తో ఘర్షణకు దిగాడు. అనంతరం రాయితో దాడి చేయడంతో తలకు గాయమైంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రమేశ్‌పై ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
అశ్వారావుపేటరూరల్: పలు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్‌లై అధికారులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. మండలంలోని ఆసుపాక, జమ్మిగూడెం, తిరుమలకుంట, గుమ్మడవల్లి గ్రామాల్లో కొందరు వ్యక్తుల ఇళ్లల్లో రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సివిల్ సప్‌లై అధికారులకు సమాచారం రావడంతో అధికారులు ఆయా ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జమ్మిగూడేనికి చెందిన భీమవరపు గంగరాజు ఇంట్లో 9 క్వింటాళ్లు, ఆసుపాక గ్రామానికి చెందిన తాడేపల్లి ఆనందరావు ఇంట్లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిపై వేర్వేరుగా 6ఏ కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్‌లై ఇన్‌చార్జ్ డీటీ ప్రభాకర్ తెలిపారు.