
అర్హులకే డీసీసీ పదవి
మణుగూరు టౌన్/దమ్మపేట: సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, సమర్థత కలిగిన వారితోపాటు ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ కిందిస్థాయి కార్యకర్తల నుంచి పరిచయం ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవి లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. గురువారం మణుగూరులోని ఇల్లెందు అతిథి గృహంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిపారు. దమ్మపేట మండలం పట్వారిగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. యువతకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య కూడా మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ అబ్జర్వర్ ఆశావహుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, పరిశీలకులు సుబ్బారావు, వై. సాగరిక, సంజీవ్ ముదిరాజ్, రాజేందర్‌రెడ్డి, మోతుకూరి ధర్మారావు, నల్లపు దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, చింతిరాల రవికుమార్, పటాన్ మహ్మద్ ఖాన్, చందా సంతోష్, తాళ్లూరి చంద్రశేఖర్ చక్రవర్తి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం