
కష్టపడితేనే సమాజంలో గుర్తింపు
పాల్వంచరూరల్: మహిళలు కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని తోగ్గూడెం తండా, రంగాపురంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోషన్ వాటిక పనులను, నారాయణరావుపేటలోని మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉపాఽధి హామీ పథకంలో వంద రోజులు పనులు పూర్తిచేసిన కుటుంబాల సభ్యుల కోసం కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 30 రోజులపాటు శిక్షణ ఇస్తామని అన్నారు. ఎస్‌బీఐ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు ముద్ర రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్‌రెడ్డి, ఎల్‌డీఎంలు వి.రామిరెడ్డి, వి.రవిప్రసాద్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఎంపీఓ చెన్నకేశ్, ఏపీఓ రంగా తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విద్యాచందన