హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం

Oct 16 2025 5:39 AM | Updated on Oct 16 2025 5:39 AM

హెచ్‌

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం

దుమ్ముగూడెం: మండలంలోని నర్సాపురం జిల్లా పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం బెక్కంటి శ్రీనివాసరావుకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. ఇన్ఫోసిస్‌, సీఎస్సార్‌ నిధులతో విద్యార్థులకు కంప్యూటర్‌ ల్యాబ్‌ను, వాష్‌ బేషిన్‌ ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాలుగా పాఠశాల ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీయించి మోటార్‌ ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల మొక్కలు నాటించారు. పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రశంసా పత్రం అందజేశారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఏఎస్పీ నరేందర్‌

చర్ల: ఆదివాసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ (ఆపరేషన్స్‌) నరేందర్‌ అన్నారు. మండలంలోని మారుమూల అటవీ ప్రాంత గ్రామం ఎర్రంపాడులో బుధవారం ఆయన భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌తో కలిసి 250 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు పోలీసుశాఖ తరఫున అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలి పారు. సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ వివేక్‌రంజన్‌, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

భక్తుల రక్షణకు సిబ్బంది

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల రక్షణకు తెలంగాణ టూరిజం శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన పోలీస్‌ సిబ్బంది నియమించింది. సిబ్బంది బుధవారం నుంచి విధులకు హాజరయ్యారు. ముందుగా ఆలయ ఈఓ దామోదర్‌రావును కలువగా ఆయన వారికి విధులను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

కోడి పుంజులు చోరీ

అశ్వారావుపేటరూరల్‌: ఖరీదైన పందెం కోడి పుంజులను అపహరిస్తున్న దొంగలను గుర్తించిన గ్రామస్తులు బుధవారం ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఎస్సై అఖిల కథనం ప్రకారం.. భద్రా చలంలోని జగదీశ్‌ కాలనీకి భార్యాభర్తలు కట్టా వెంకటేష్‌, వెంకటలక్ష్మి కలిసి అశ్వారావుపేట మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామంలో మూడు కోడి పుంజులను చోరీ చేశా రు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు వారిని గమనించి వెంబడించారు. వెంకటేష్‌ పారి పోగా, భార్య వెంకటలక్ష్మిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా, ఎస్సై అఖి ల చేరుకుని మహిళను అదుపులోకి తీసుకు ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చోరీకి పాల్ప డిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రిసార్ట్‌కు బాలికతో

వచ్చిన యువకుడు?

యువకుడిని ఠాణాకు తరలించిన పోలీసులు?

ములకలపల్లి: మండల సరిహద్దులోని ఓ రిసా ర్ట్‌ గదిలో మైనర్‌ బాలిక ఓ యువకుడితో ఉండగా బంధువులు పట్లుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ములకలపల్లి శివారులోని రిసార్ట్‌కు ఓ యువకుడు, ఉమ్మడి పూసుగూడెం పంచాయతీకి చెందిన మైనర్‌ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న బాలిక బంధువులు రిసార్ట్‌కు చేరుకుని యువకుడిని ప్రశ్నించినట్లు సమాచారం. బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లి కుటుంబీకుల వద్దకు చేర్చినట్లు తెలి సింది. విషయం వెలుగులోకిరాగా, ఘటనా ప్రదేశానికి వచ్చిన పోలీసులు వరంగల్‌ ఏరి యాకు చెందిన యువకుడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ వ్యవహా రంపై ఎస్సై మధుప్రసాద్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని తెలిపారు. రిసార్ట్‌ నిర్వాహకులను వివరణ కోరగా.. రిసార్ట్‌ చూసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తాము ఎవరికీ గది కేటాయించలేదని పేర్కొన్నారు.

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం1
1/2

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం2
2/2

హెచ్‌ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement