
‘ఉపాధి’తో పశువుల షెడ్లు..
ఎంతో ప్రయోజనకరం
సద్వినియోగం చేసుకోవాలి
● ఈజీఎస్ జాబ్‌కార్డు ఉన్న రైతులు అర్హులు ● నాటు కోళ్ల పెంపకానికీ షెడ్ల నిర్మాణం
కరకగూడెం: కేంద్ర ప్రభుత్వం పశు సంపద పెంపకానికి తోడ్పాటునందిస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్లు నిర్మించుకునే అవకాశం కల్పించింది. నాటు కోళ్ల పెంపకానికీ షెడ్లు నిర్మించుకోవచ్చు. జిల్లాలో మండలానికి 20 యూనిట్ల చొప్పున మంజూరుకాగా, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన షెడ్లను ఇటీవల నిర్వహించిన ‘పనుల జాతర’ కార్యక్రమంలో అధికారులు ప్రారంభించారు. ఆధునిక షెడ్లలో సరైన వెంటిలేషన్, పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండటంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. షెడ్లలో మూత్రం శుభ్రం చేయడానికి ప్రత్యే క ఏర్పాట్లు కూడా ఉంటాయి.
ఇవీ నిబంధనలు
ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్న రైతులకు మాత్ర మే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జిల్లా వ్యా ప్తంగా 2.23లక్షల జాబ్‌కార్డులున్నాయి. షెడ్డు నిర్మాణా నికయ్యే వ్యయాన్ని ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం 100శాతం చెల్లిస్తుంది. ఇందులో కూలీల వేతనం, నిర్మాణ సామగ్రి ఖర్చులు కలిపి ఉంటా యి. మేకలు, గొర్రెల, కోళ్ల షెడ్ల నిర్మాణానికి రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు మంజూరు చేస్తారు. షెడ్లు నిర్మించుకున్నాక అధికారులు బిల్లులు చెల్లిస్తా రు. పంచాయతీ కార్యదర్శి/ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద అప్లికేషన్ ఫారం తీసుకుని పేరు, జాబ్ కార్డు నంబర్, పశువుల సంఖ్య, భూమి తదితర వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించాక క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలి స్తారు. అర్హులైతే అనుమతులు జారీ చేసి, ఉపాధి హామీ కింద పనులు ప్రారంభిస్తారు.
ఉపాధిపథకం ద్వారా షెడ్డు నిర్మించుకున్నాం. షెడ్డులో వెంటిలేషన్, పారిశుద్ధ్యానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మా జీవాల ఆరోగ్యం బాగుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇచ్చింది.
–చిర్రా లక్ష్మి, లబ్ధిదారులు, మోతె గ్రామం, కరకగూడెం
ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేశాం. మెరుగైన షెడ్ల ద్వారా పశువుల ఆరోగ్యం బాగుంటుంది.
–విద్యాచందన, డీఆర్‌డీఓ

‘ఉపాధి’తో పశువుల షెడ్లు..

‘ఉపాధి’తో పశువుల షెడ్లు..