
పోక్సో కేసు నమోదు
కొత్తగూడెంటౌన్: బాలికను వేధించిన వ్యక్తిపై బుధవారం టూటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. రామవరం నాగయ్యగడ్డ బస్తీకి చెందిన పల్లపు సాగర్ అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఒప్పుకోకపోతే చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రతాప్ తెలిపారు.
కాపర్ వైరు చోరీ
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామం వీరాపురం క్రాస్ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రూ. 40 వేల విలువైన కాపర్ తీగను చోరీ చేశారు. బుధవారం ఇన్‌చార్జ్ ఏఈ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
జూలూరుపాడు: మండలంలోని గంగారంతండాకు చెందిన రైతు ఆంగోత్ కృష్ణకు సంబంధించిన దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో బుధవా రం మృతి చెందింది. మేత కోసం పొలంలో వదలగా ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
కాపర్ వైర్ దొంగ పరారీ
జూలూరుపాడు: పంట పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్‌ను చోరీకి పాల్పడిన దొంగ పరారీలో ఉన్నాడని జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి బుధవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. 2010లో పలు గ్రామాల్లోని పంటపొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి కొత్తగూడెం అశోక్‌నగర్‌కు చెందిన లారీ క్లీనర్ తమ్మయ్య నాయుడు శ్రీరామ్ కాపర్ వైర్ అపహరించాడు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కొద్ది రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు నిబంధనలను ఉల్లఘించి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో కొత్తగూడెం అదనపుకోర్టు శ్రీరామ్‌కు నోటీసులు జారీచేసింది. నిందితుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.