
ఆర్థికాభివృద్ధి సాధించాలి
భద్రాచలంటౌన్: గిరిజన యువత ఐటీడీఏ అందిస్తున్న వృత్యంతర శిక్షణలను సద్వి నియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి సాధించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నారు. వరంగల్‌లో టీఎస్‌ఆర్‌టీసీ ఆధ్వర్యంలో జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కాలేజ్‌లో నిర్వహించే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు ఎంపికై న గిరిజన యువకులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా శిక్షణ పూర్తిచేసుకుని జీవితంలో స్థిరపడాలని చెప్పారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు దగ్ధం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
కొండచిలువ హతం
దుమ్ముగూడెం: మండలంలోని అంజుబాక క్రాస్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దూరిన కొండ చిలువను స్థానికులు చంపేశారు. మంగళవారం రాత్రి సమయంలో కొండ చిలువ ఇంట్లో దూరి కోళ్లను తినేందుకు చూస్తుండగా కోళ్లు బాగా అరవడంతో గమనించి హతమార్చారు.
రోడ్డు ప్రమాదంలో
పలువురికి గాయాలు
పాల్వంచ: లారీ, ఆటో ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం నవభారత్ ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.