
ఏజెన్సీలను రద్దు చేయాలి
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ కమిటీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య కోరారు. ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ శాఖల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్‌కు వినతిపత్రం అందించి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున సహకరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. కార్మిక శాఖ మంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారని లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ దుర్గం శ్రీను, ట్రెజరర్ సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ, బాలకృష్ణ, క్రాంతి, విజయలక్ష్మి, సురేష్, రాజేష్, గౌస్ పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య