
ముగిసిన అటవీశాఖ జోనల్ క్రీడలు
చుంచుపల్లి: కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న అటవీ శాఖ జోనల్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన 800 మంది అటవీ ఉద్యోగులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ తదితర క్రీడా పోటీలను నిర్వహించగా, ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌కు భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.భీమానాయక్ ట్రోఫీ అందజేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను, సిబ్బందిని కూడా సీసీఎఫ్, డీఎఫ్‌ఓలు సత్కరించారు. ఈ సందర్బంగా సీసీఎఫ్ భీమానాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. ఐదు జిల్లాల అటవీ అధికారులు కిష్టాగౌడ్, సిద్ధార్థ విక్రమ్ సింగ్, బత్తుల విశాల్, బి.లావణ్య, అనూజ్ అగర్వాల్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు
అందజేసిన సీసీఎఫ్