ఊపిరి తీసుకోలేక.. | - | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసుకోలేక..

Oct 12 2025 6:43 AM | Updated on Oct 12 2025 6:43 AM

ఊపిరి

ఊపిరి తీసుకోలేక..

శ్వాసకోశ రుగ్మతలతో

పలువురి అస్వస్థత

కిటకిటలాడుతున్న

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు

వాతావరణ మార్పులే కారణం!

ఇతర సమస్యలు కూడా..

వాతావరణ మార్పులతోనే..

నిర్లక్ష్యం చేయకండి

భద్రాచలంఅర్బన్‌: కొద్ది రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో పసిపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. చలి పెరుగుతుండటంతో చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ప్రైవేట్‌.. ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి నిత్యం వచ్చేపిల్లల ఓపీ సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. రెండు నెలలుగా కొద్ది రోజులు వర్షం పడటం ఆగిపోవడం, మళ్లీ వరుసగా రెండు రోజుల పాటు వర్షాలు పడటం ఆగిపోవటం, తరువాత మళ్లీ ఒక వారం రోజులు తీవ్రంగా ఎండ రావడం, ఆ తరువాత మళ్లీ వర్షాలు పడటంతో చలి వాతావరణంలో పిల్లలు అత్యధికంగా జ్వరం, దగ్గుతో పాటు ఆయాసానికి గురవుతున్నారు. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. న్యూమోనియా లక్షణాలున్న వారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ప్రాంతంలో సొట్టలు కనిపిస్తుంటాయి. పిల్లలు మరీ ఇబ్బందులకు గురవుతుంటారు. సాధారణంగా రెండు నెలలలోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు, ఏడాదిలోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్ల లోపు పిల్లలు 40 సార్లు, ఐదేళ్లకు మించిన పిల్లలు 30 సార్లు శ్వాస పీల్చుకున్నారంటే వారిలో న్యుమోనియా లక్షణాలున్నట్లు భావించాలి.

జాగ్రత్తలే రక్ష..

న్యూమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీని తీవ్రత పెరుగుతున్నా కొద్ది పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. తీవ్రతను బట్టి వైరల్‌ న్యుమోనియానా, బ్యాక్టీరియల్‌ న్యుమోనియానా అనే విషయాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేస్తారు. చలి కాలం మొదలయ్యే రోజులు వస్తుండటంతో ప్రస్తుతం ఈ రోగాలు చిన్నారుల దరిచేరకుండా రానున్న రోజుల్లో పిల్లలకు చల్లని గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్తుంటే చల్లటి గాలికి పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.

ఇబ్బంది పడుతున్న

చిన్నారులు

వైరల్‌ ఫీవర్‌ నుంచి క్రమంగా ఇతర వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా సంక్రమించేందుకు అవకాశం ఉంది. ఇందుకు ఎక్కువ రోజులు పడుతుంది. గతంలో రెండు రోజులు చికిత్స తీసుకున్న సమస్యకు ఇప్పుడు ఎక్కువ రోజుల వరకు చికిత్స పొందాల్సి వస్తోంది. మొదటి దశలో అతి తక్కువ స్థాయిలో ఉంటుంది. క్రమక్రమంగా అది పెరిగి రెండో దశలో ఆస్తమా లక్షణాలు బయట పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూడు, నాలుగు దశల్లో రోజుకు రెండు, మూడు సార్లు రాత్రి పూట దగ్గు, ఆయాసంతో బాధపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పండుగ సెలవులు పూర్తయి పాఠశాలలు మొదలవడంతో హైజీన్‌ కారణంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు సోకడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లుగా ఎక్కవ మంది చిన్నారుల్లో కనిపించింది. పిల్లల్లో ఏమాత్రం అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స ఇప్పించాలి. –డాక్టర్‌ క్రాపా విజయ్‌,

పిల్లల వైద్య నిపుణుడు, భద్రాచలం

పిల్లలకు వచ్చే దగ్గు, తుమ్ములు, జలుబు వంటి వాటికి తల్లిందండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. వాటితో తగ్గిపోతుందనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యాధుతు తీవ్రమవుతుంటాయి. ప్రత్యేకంగా వైద్యం చేయకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తరచుగా పిల్లల వైద్యులను సంప్రదించి, వారి సలహాలను అనుసరించి మందులు తప్పనిసరిగా వాడాలి.

–డాక్టర్‌ రాజశేఖరరెడ్డి,

ఆర్‌ఎంఓ, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం

ఊపిరి తీసుకోలేక.. 1
1/2

ఊపిరి తీసుకోలేక..

ఊపిరి తీసుకోలేక.. 2
2/2

ఊపిరి తీసుకోలేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement