క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Oct 11 2025 6:30 AM | Updated on Oct 11 2025 6:30 AM

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ

ప్రారంభం

ఖమ్మం స్పోర్ట్స్‌: ప్రపంచంలో కొన్ని చిన్నదేశాల పేర్లను సైతం గుర్తుపెట్టుకోవడానికి అక్కడి ప్రజలు క్రీడల్లో రాణించడమే కారణమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ సొంతమవుతుందనే విషయాన్ని గుర్తించి విద్యార్థులను తీర్చిదిదిద్దేలా రాష్ట్రప్రభుత్వం నూతన క్రీడా పాలసీని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు కూడా గెలుపోటములను సమానంగా తీసుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని తెలిపారు. అనంతరం రఘురాంరెడ్డి కొద్దిసేపు టేబుల్‌ టెన్నిస్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్‌బాబు, పాల్గొన్నారు.

మనోళ్ల ముందంజ

రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు తొలి రోజు హోరాహోరీగా కొనసాగాయి. అండర్‌–11 కేట గిరీ నుంచి సీనియర్స్‌ వరకు క్రీడాకారులు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డారు. కాగా, అండర్‌–17 బాలు ర సింగిల్స్‌లో పూల్‌ విన్నర్‌గా పి.జ్వాలిత్‌, అండర్‌–13 సింగిల్స్‌లో కోగిరి హితేష్‌ ముందంజలో నిలిచి నాకౌట్‌ దశకు చేరడం విశేషం. బాలికల విభాగంలో జి.సిరి తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement