
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మణుగూరు రూరల్ : ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్‌పై రాజ్యాంగబద్ధంగా బిల్లు చేయాలని, ఇందుకు బీఆర్‌ఎస్ కూడా మద్దతు తెలుపుతుందని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, ముత్యంబాబు, అడపా అప్పారావు, నూకారపు రమేష్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వేర్పులసురేష్, ముద్దంగుల కృష్ణ, రామకోటి, గుర్రం సృజన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు