
ఎస్‌జీఎఫ్ విజేతలకు బహుమతుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ముగియగా విజేతలకు గురువారం బహుమతులు అందజేశారు. అండర్ – 17 బాలుర విభాగం కబడ్డీలో మొదటి బహుమతిని ఇల్లెందు జట్టు కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని అశ్వారావుపేట, తృతీయ బహుమతిని కొత్తగూడెం జోన్లు దక్కించుకున్నాయి. ఖోఖో పోటీల్లో ప్రథమ బహుమతి అశ్వారావుపేట, ద్వితీయ బహుమతి కొత్తగూడెం, తృతీయ బహుమతి పాల్వంచ జోన్లు దక్కించుకోగా, వాలీబాల్ పోటీల్లో పాల్వంచ ప్రథమ బహుమతి, ఇల్లెందు ద్వితీయ బహుమతి, కొత్తగూడెం తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. కార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సీత, సుజాత, బుగ్గ వెంకటేశ్వర్లు, భావ్‌సింగ్ లక్ష్మణ్, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.