
ఆశలపై నీళ్లు!
నిరాశ , నిస్పృహ లో ఆశావహులు
తొలిరోజు నామినేషన్ల దాఖలు అంతంతే
తొలిరోజు కొందరే..
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం గురువారం తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం10.30 గంటల నుంచి తొలి విడత ఎన్నికలు జరిగే అశ్వాపురం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, బూర్గంపాడు, జూలూరుపాడు, చర్ల మండలాల పరిధిలోని 11 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 113 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రిజర్వేషన్లపై బుధవారం విచారించిన హైకోర్టు.. తీర్పును గురువారానికి వాయిదా వేసిన నేపథ్యంలో తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 17 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. భద్రాచలంలోని 1, 2, 3, 4, 12, 13, 14 ఎంపీటీసీ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబెల్లి–1, నర్సాపురం–2, లక్ష్మీనగరం–1, ప్రగళ్లపల్లి–1, నారాయణరావుపేట –1, దుమ్ముగూడెం–1, తూరుబాక–1 చొప్పున, అశ్వాపురం మండలం మొండికుంట ఎంపీటీసీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 11 మండలాల పరిధిలో జెడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా, హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తొలిరోజు వేసిన నామినేషన్లను అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది కొంత సందిగ్ధం నెలకొంది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మిని సంప్రదించగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు.
అన్ని ఏర్పాట్లతో సిద్ధమైన అధికారులు..
ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆయా కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నామినేషన్ల దాఖలు సందర్భంగా పోటీచేసే అభ్యర్థులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు.
హైకోర్టు స్టేతో ఆగిన ఎన్నికల ప్రక్రియ