
సైబర్ నేరస్తుడి అరెస్ట్
దుమ్ముగూడెం: సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు దుమ్ముగూడెం పోలీసులు గురువారం తెలిపారు. సీఐ వెంకటప్పయ్య కథనం ప్రకారం.. మండలంలోని పెద్దనల్లబల్లి గ్రామ సెంటర్‌లో బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపాయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 150 పాత ఫోన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా బిహార్ రాష్ట్రంలోని కతీహార్ జిల్లాకు చెందిన అక్తర్ అలీగా తేలింది. ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తూ, ప్రజల నుంచి పాత మొబైల్ ఫోన్‌లు కొని బిహార్‌కు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేసే తన్వీర్మరియు, హలీమ్‌లకు అందజేస్తున్నాడు. వారు మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్‌వేర్‌లను మార్చేసి ఇస్తే నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. ఆ నగదును అందరూ పంచుకుంటున్నట్లు విచారణలో వెల్లడించాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
150 పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం