
మాజీ దళ కమాండర్ సీపీఎంలో చేరిక
పాల్వంచ: ప్రజా ప్రతిఘటన రాష్ట్ర నాయకుడిగా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల బాధ్యుడిగా, ఏజెన్సీ దళ కమాండర్‌గా పనిచేసిన శంకరన్న అలియాస్ దాసరి వీరయ్య సీపీఎంలో చేరారు. గురువారం మంచికంటి భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కొండబోయిన వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, పాకాల వెంకట్రావ్, తులసీరాం, కంటె శ్రీను, నాగభూషణం, వినోద, నాగర్జున తదితరులు పాల్గొన్నారు.
కై క విగ్రహం ధ్వంసంపై
కేసు నమోదు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని కరకట్ట ప్రాంతంలో ఉన్న కై క విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం భద్రాచలం దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధుడి ఆత్మహత్య
బూర్గంపాడు: మండల పరిధిలోని సోంపల్లి గ్రామానికి చెందిన పెంకె లక్ష్మయ్య(60) బుధవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు పాల్వంచలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్‌ఐ నాగబిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.