
ఏఆర్టీ బాధితులపై వివక్ష చూపొద్దు
చుంచుపల్లి/టేకులపల్లి: ఏఆర్టీ బాధితులకు వివక్ష లేకుండా వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. గురువారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు బాధితులకు భయం, సంకోచం వంటి ఉంటాయని, ఆ సమయంలో వైద్యసిబ్బంది ఆత్మీయతతో వ్యవహరించాలని చెప్పారు.
యువత పొగాకుకు దూరంగా ఉండాలి
యువత పొగాకుకు దూరంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. గురువారం టొబాకో ఫ్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తంబాకు, గుట్కా, పొగాకు, చుట్ట, బీడీ వినియోగం ల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్‌సీడీపీఓ డాక్టర్ మధువరణ్, వైద్యులు దినేష్, డాక్టర్లు రమేష్, నర్సింహారావు, శాంసన్, ప్రవీణ్, పుల్లారెడ్డి, సిబ్బంది పార్వతి, చంద్రకళ దేవా తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి

ఏఆర్టీ బాధితులపై వివక్ష చూపొద్దు