
నేటి నుంచి టీ.టీ. ర్యాంకింగ్ టోర్నీ
ర్యాంకింగ్ క్రీడాకారులు వచ్చారు..
ఖమ్మం చేరుకున్న పది జిల్లాల జట్లు ఇండోర్ స్టేడియంలో
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన హాల్‌లో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ జరగనుంది. బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు ఖమ్మం చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలు అండర్–11 నుంచి సీనియర్స్ వరకు బాలబాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో జరుగుతాయి.
టేబుల్ టెన్నిస్ పోటీలకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుంచి ర్యాంకింగ్ క్రీడాకారులు వచ్చారు. ఇక్కడ ప్రతిభ చూపేవారిని మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం. టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం.
– వి.సాంబమూర్తి,
టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
పోటీల నిర్వహణకు ఏర్పాట్లు

నేటి నుంచి టీ.టీ. ర్యాంకింగ్ టోర్నీ