
సై
నేటి నుంచి మూడురోజులపాటు నామినేషన్ల స్వీకరణ
మొదటి విడతలో 113 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీలకు పోలింగ్
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తి చేసిన అధికారులు
తొలి విడత ఎన్నికలు జరిగే ఎంపీటీసీలు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు
సమరానికి
చుంచుపల్లి: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. మొదటి విడతలో 113 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 13,14 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ నెల 23న పోలింగ్ నిర్వహించిన తర్వాత నవంబర్ 11న తుది ఫలితాలను ప్రకటిస్తారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే పదకొండు మండలాల్లో జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ సందర్భంగా జెడ్పీటీసీ స్థానంలో పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీ స్థానాలకు జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షల చొప్పున ఖర్చు పెట్టేలా ఎన్నికల సంఘం పరిమితిని విధించింది. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో 11 మంది రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీసీలకు సంబంధించి 39 మంది రిటర్నింగ్ అధికారులు, 39 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 113 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోనే ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్వోలు స్వీకరిస్తారు. నామినేషన్లు సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో పూర్తి విషయాలను పొందుపరచాలి.
–బి.నాగలక్ష్మి, అదనపు ఎన్నికల అధికారి
23న తొలిదశలో 11 మండలాల్లో పరిషత్ ఎన్నికలు
మండలం ఎంపీటీసీలు పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు
అశ్వాపురం 12 65 33,347
భద్రాచలం 14 60 40,761
బూర్గంపాడు 17 89 50,351
చర్ల 12 67 32,653
దుమ్ముగూడెం 13 73 36,762
కరకగూడెం 5 26 12,869
మణుగూరు 11 60 36,480
పినపాక 9 55 27,350
ఆళ్లపల్లి 5 21 9,314
గుండాల 5 25 13,330
జూలూరుపాడు 10 61 27,985

సై

సై