
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
డిప్యూటీ సీఎంను
కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
ఇల్లెందు: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలవగా, ఇల్లెందు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా చూడాలని సూచనలు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరం సురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, శ్రీనివాస రెడ్డి, గణేష్, సర్దార్, రాము తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
అశ్వారావుపేటరూరల్: ప్లాంటేషన్ నిర్వహణ, మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని, సంరక్షణలో నిర్లక్ష్యం చేయొద్దని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో పర్యటించారు. మండలంలోని ఊట్లపల్లి సమీపంలో అటవీ శాఖ ద్వారా 50 ఎకరాల్లో పెంచుతున్న ప్లాంటేషన్‌ను సందర్శించి మొక్కలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఫారెస్టు గెస్ట్ హౌస్ భవనాన్ని పరిశీలించి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, ఎఫ్‌డీఓ దామోదర రెడ్డి, ఫారెస్టు రేంజర్ మురళి, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.
పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలి
పాల్వంచ: పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జె.స్వర్ణలత లెనినా అన్నారు. బుధవారం పాల్వంచ ప్రాజెక్ట్ పరిధిలోని షిరిడీ సాయినగర్‌లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, పాఠశాలలో కిశోర బాలికలకు ‘మీరు తీసుకునే ఆహారం, మీ పెరుగుదల’అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో అత్యధిక పౌష్టిక విలువలు ఉన్న ఆహా రం తీసుకుంటే ఆరోగ్య వంతులుగా ఉంటా రని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మైథిలి, సీడీపీఓ ప్రసన్నలక్ష్మి, సూపర్‌వైజర్ రమాదేవి, శారద, అశోక కుమారి, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ రాము, కో ఆర్డినేటర్ సోనీ, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రామయ్య కల్యాణం

ఘనంగా రామయ్య కల్యాణం

ఘనంగా రామయ్య కల్యాణం