
ఉరివేసుకుని పీఈటీ ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన చుంచు కృష్ణ (46) అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల ఆశ్రమ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం స్వగ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై విధులకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్న భర్త కృష్ణ తనతో గొడవపడి ఇంట్లో ఉరివేసుకున్నాడని భార్య యశోద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కొమరారం ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణ వాలీబాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారుడిగా రాణించాడు. పలువురికి శిక్షణ ఇచ్చాడు.