
రైతులకు యూరియా కష్టాలు
పినపాక: రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల పరిధి లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాల యం ఎదుట యూరియా బస్తాలు కోసం రైతులు బారులుదీరారు. ఒకరికి ఒక యూరియా బస్తా ఇవ్వడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేటీపీఎస్ కాల్వలో మొసళ్ల సంచారం
పాల్వంచ: మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి కేటీపీఎస్‌కు నీళ్లు వచ్చే కాల్వలో మొసళ్లు సంచరిస్తున్నాయి. రిజర్వాయర్ నుంచి మొసళ్లు కాల్వలోకి వస్తున్నాయి. సుమారు పది కిలోమీటర్లు ఉండే ఈ కాల్వలో అక్కడక్కడ ఓడ్డుకు చేరి, పరిసరాల్లో సంచరిస్తుడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంగళ, బుధవారాల్లో కరకవాగు రోడ్‌లోని కాల్వ లో మొసళ్లు కనిపించాయని స్థానికులు తెలిపారు.
ఉద్యాన కళాశాల
విద్యార్థుల సందర్శన
అశ్వారావుపేటరూరల్: మండలంలోని అచ్యుతాపురం గ్రామాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించి పంట పొలాలకు వినియోగించే రసాయనిక ఎరువులు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యాన పంటలకు విని యోగించే రసాయనాలపై ఉండే గుర్తుల గురించి రైతులకు వివరించారు. పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల విద్యార్థులు శివ, సత్యసాగర్, అభినవ్, అజయ్, నేతాజీ, యశ్వంత్ పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
పాల్వంచరూరల్: అక్రమంగా కిన్నెరసాని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం నుంచి రాజాపురంవైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్‌చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, ఉప్పుసాక గ్రామానికి చెందిన పెరుమాళ్లపల్లి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
మేకలు చోరీ
పాల్వంచరూరల్: వేర్వేరు గ్రామాల్లో ఒకే రోజు 8 మేకలను అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి మొండికట్ట గ్రామంలో సంపంగి వెంకటేశ్వర్లు ఇంటి పక్క దొడ్డిలో ఉన్న ఐదు మేకలను ఈ నెల 6వ తేదీ రాత్రి సమయంలో దొంగలు అపహరించారు. అదే రోజు రాత్రి మండల శివారు గ్రామమైన మామిడిగూడెంలోని ముక్కటి మల్లయ్యకు చెందిన మూడు మేకలను దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
టీజీ ఎఫ్‌డీసీ
వాచర్‌పై దాడి
ములకలపల్లి: అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్‌డీసీ) వాచర్ అల్లూరి శ్రీనివాస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడు శ్రీనివాస్ కథనం ప్రకారం.. గొల్లగూడెం (కమలాపురం క్రాస్ రోడ్) వాచర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలపరిఽధిలోని మాధారం గ్రామంలో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి తన ఇంటి ముందు ఫోన్‌లో మాట్లాడుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కుటుంబీకులు, సమీపస్తులు గమనించి వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యారు. శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో మంగపేట పీహెచ్‌సీలో ప్రాఽథమిక చికిత్స పొందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎస్.మధుప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

రైతులకు యూరియా కష్టాలు

రైతులకు యూరియా కష్టాలు