
జిల్లాస్థాయి క్రీడలు షురూ..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రకాశంలో 69వ ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను బుధవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపాలని సూచించారు. కాగా బుధవారం అండర్–17 విభాగంలోని బాలబాలికలకు పోటీలు నిర్వహించారని, గురువారం అండర్–14 విభాగంలో పోటీలు నిర్వహిస్తామని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ వాసిరెడ్డి నరేష్ కుమార్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, డీసీఈబీ సెక్రెటరీ నీరజ, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, యుగంధర్, స్టెల్లా, కవిత, వీరన్న, కృష్ణ, పామర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో పరిశీలన
ప్రకాష్‌నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సందర్శించి పరిశీలించారు. హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. చిన్నారులను ఎత్తుకుని ఆడిపించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.