సీఎస్‌ఆర్‌ విధివిధానాలపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఆర్‌ విధివిధానాలపై సమీక్ష

Oct 8 2025 8:23 AM | Updated on Oct 8 2025 8:23 AM

సీఎస్‌ఆర్‌ విధివిధానాలపై సమీక్ష

సీఎస్‌ఆర్‌ విధివిధానాలపై సమీక్ష

కొత్తగూడెంఅర్బన్‌: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్‌ న్యూఢిల్లీ నుంచి మంగళవారం కోల్‌ ఇండియా పరిధి బొగ్గు సంస్థలు, మైనింగ్‌ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో సింగరేణి సంస్థ తరపున హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుండి డైరెక్టర్‌(పా) గౌతమ్‌ పొట్రు, కొత్తగూడెం కార్యాలయం నుండి జీఎం(పర్సనల్‌) వెల్ఫేర్‌ – సీఎస్‌ఆర్‌ జీ.వీ.కిరణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొగ్గు రంగంలో సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపు, వినియోగంపై చర్చించి సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో సింగరేణి అధికారులు బి.గట్టుస్వామి, గౌస్‌పాషా, రవికిశోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement