
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కొత్తగూడెంటౌన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్‌పై దాడికి నిరసనగా మంగళవారం కొత్తగూడెం కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ సీజేఐపై దాడి జరగడం భారత న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.గోపీకృష్ణ, న్యాయవాదులు మాధవరావు, కాసాని రమేష్, ఉప్పు అరుణ్, కె.కృష్ణప్రసాద్, ఆడపాల పార్వతి, మాలోతు ప్రసా ద్, ఉటుకూరి పురుషోత్తంరావు, పి.నిరంజన్‌రావు, ఎస్.విజయభాస్కర్‌రెడ్డి, పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని ఆంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన తెలపగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎర్రా కామేశ్, న్యాయవాదులు పాల్గొన్నారు.