
ఏటీసీతో యువతకు ఉజ్వల భవిష్యత్
మణుగూరు రూరల్: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో ఇచ్చే శిక్షణతో నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని ముత్యాలమ్మనగర్ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఏటీసీని మంగళవారం పరిశీలించిన ఆయన పెండింగ్ పనుల పూర్తిపై సూచనలుచేశారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ యువతకు సాంకేతికత శిక్షణను చేరువ చేయాలనే భావనతో ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ జి.రవి, సూపరింటెండెంట్ టీఎన్.జ్యోతిరాణి, ఏటీఓలు ఎం.శ్రీనివాసరావు, జీవీ.కృష్ణారావు, ఏ.నర్సయ్య, వేణుగోపాల్, సిబ్బంది పూర్ణచందర్‌రావు, సూనాథ్ అశోక్, శ్రావణి, చందు పాల్గొన్నారు.