
కుమురం భీం ఆశయస్ఫూర్తిని కొనసాగించాలి
భద్రాచలం: గిరిజన హక్కుల సాధనతో పాటు జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరాడిన ధీరుడు కుమురం భీం ఆశయ స్ఫూర్తిని గిరిజన యువత కొనసాగించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో మంగళవారం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పీఓ నివాళులర్పించి మాట్లాడారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి మన్యంలో పోరాటం సాగించిన భీం ఆదర్శప్రాయుడయ్యారని తెలిపారు. ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, అధికారులు ఉదయ్‌కుమార్, భాస్కర్, మధుకర్, రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆదికర్మ యోగి నివేదిక సిద్ధం
గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నామని ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్‌రెడ్డి మంగళవారం ఆదికర్మ యోగి పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం అమలుచేస్తున్న పథకాన్ని విజయవంతం చేసేలా నివేదికలను త్వరగా పంపించాలని సూచించారు. ఈమేరకు భద్రాచలం నుంచి ఏపీఓ మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పరిధి 19 మండలాల్లోని 130 గ్రామాల్లో సమస్యలను గుర్తించామని తెలిపారు. వీసీలో టీసీఆర్‌టీఐ డైరెక్టర్ సమజ్వాల, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్