
కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెం టౌన్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. వాల్మీకి రామాయణం ఆధారంగా హితోక్తులు పాటిస్తే అందరూ ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. బీసీ సంక్షేమాధికారి పి.విజయలక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం, వాల్మీకి బోయ సంఘాల నాయకులు నాయకులు కొదుమూరి సత్యనారాయణ, ముదురుకోళ్ల కిషోర్, ఎం.వెంకన్న, బి.నందకిషోర్, ఎం.శ్రీనివాస్, కె.సాంబయ్య, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్యస్వామి పూలమాల వేసి నివాలర్పించారు. అధికారులు, సిబ్బంది సత్యనారాయణ, సుధాకర్, లాల్‌బాబు, కృష్ణారావు, మంజ్యూనాయక్ పాల్గొన్నారు.