
ప్రకృతి సంపదను కాపాడుకోవాలి
అరుణోదయ సాహితీ సాంస్కృతిక
సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
గుండాల : ప్రజలు ప్రకృతి సంపదను కాపాడుకోవాలని అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని జయశంకర్ నగర్ యాపలగడ్డ గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సాహంగా బతుకమ్మ ఆడి బహుజన బతుకమ్మ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ప్రకృతి రక్షణ, ప్రజలకు రక్షణగా బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులు బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాట మాటతో ప్రారంభించి చివరిగా ఉప్పల్ మండల కేంద్రంలో ముగింపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణక్క, రుద్ర. మల్సూర్, సమ్మయ్య పాల్గొన్నారు.