
విద్యుత్ లైన్ల ఏర్పాటుపై పరిశీలన
భద్రాచలం అర్బన్/మణుగూరు రూరల్: మణుగూరు మండలంలోని వైఎస్‌ఆర్‌నగర్‌లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై విద్యుత్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి.మోహన్‌రావు శనివారం పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్ నగర్‌వాసులు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ ప్రాంతాన్ని పరిశీలించారు. సోలార్ విద్యుత్, స్తంభాలు, లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. భద్రాచలం విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డైరెక్టర్‌ను అధికారులు సన్మానించారు. ఎస్‌ఈ మహేందర్, డీఈలు జీవన్‌కుమార్, వెంకటేశ్వర్లు ఏడీఈలు వేణు, ఉమారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ త్వరితిగతిన పూర్తి చేయాలి
దుమ్ముగూడెం: బండిరేవు గ్రామంలో నిర్మిస్తు న్న విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివా రం పర్ణశాల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను, బండిరేవు గ్రామంలో నిర్మిస్తున్న నూతన సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రూ.1.96లక్షలతో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పర్ణశాల శ్రీ సీతా రామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేశారు. అధికారులు జీవన్, వెంకటేశ్వర్లు, యాసిన్, ప్రభాకర్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.