
పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యం
బూర్గంపాడు/అశ్వాపురం: ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడం ఆవశ్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. బూర్గంపాడు మండలంలో నాగినేనిప్రోలు ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వా డీ కేంద్రాన్ని (పూర్వ ప్రాఽథమిక పాఠశాల)ను శని వారం ఆయన కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రంలో జరిగే కార్యకలాపాలపై ఆరా తీశా రు. ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న కృత్రిమ మేధ(ఏఐ) తరగతులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అశ్వాపురం మండలం నెల్లిపాకలో మునగతోటను పరి శీలించారు. ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అధికారులు మృణాల్ శ్రేష్ఠ, సౌరభ్ శర్మ, విద్యాచందన, నాగలక్ష్మి, నాగరాజశేఖర్, సతీష్‌కుమార్, సైదులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు