ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ

Sep 18 2025 7:10 AM | Updated on Sep 18 2025 7:10 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ

ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ

చర్ల: చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని సీ–కత్తిగూడెంలో ప్రధాన రహదారిపై ఇసుక లారీ నిలిపి ఉంది. వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలవగా, లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. స్థానికులు గమనించి, గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అటవీ శాఖకు

నూతన హంగులు

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి అటవీశాఖకు జిల్లా కేంద్రం తరహాలో నూతనహంగులు రానున్నాయి. టింబర్‌ డిపోప్రాంగణంలోని స్థలాన్నిపరేడ్‌గ్రౌండ్‌గా తీర్చిదిద్దా రు. ఇందులోరూ.2లక్షలతో అటవీ అమరవీరుల స్తూపం, రూ.4 లక్షలతో పోడియం ఏర్పాటు చేశారు. డివిజన్‌స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ, సమావేశాల నిర్వహణకోసం రూ.12 లక్షలతో మీటింగ్‌హాల్‌ నిర్మించారు.

నీలాద్రి అర్బన్‌ పార్కులో..

సందర్శకుల ఆదరణ పెరుగుతున్న నీలాద్రి అర్బన్‌ పార్కుకు రూ.10 లక్షలతో మారో రెండు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్‌ పార్కులోని వన్యప్రాణులు బయటకు రాకుండా.. వీధి కుక్కలు లోపలికి చొరబడకుండా కన్జర్వేషన్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో 1.5 కిలోమీటర్ల మేర చైన్‌లింగ్‌ ఫెన్సింగ్‌తో రక్షణ చర్యలు చేపట్టారు. పనులను ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభిస్తారు.

నేడు రూ.90 కోట్ల పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement