
లోక్ అదాలత్‌కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 11 కోర్టుల పరిధిలో దాదాపుగా 4576 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యా యి. కొత్తగూడెం కోర్టులో సివిల్ కేసులు 32, క్రిమి నల్ కేసులు 2,023, పీఎల్‌సీ కేసులు 278, మో టార్‌వాహన ప్రమాద కేసులు 24, మొత్తం 2,333 కేసులకు పరిష్కారం లభించింది. వాహన ప్రమాద కేసుల్లో రూ.1.82కోట్ల పరిహారం బాధితులకు లభించింది. ఇల్లెందు సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 363, పీఎల్‌సీ కేసులు 132, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,106, పీఎల్‌సీ కేసులు 74, మణుగూరులో క్రిమినల్ కేసులు 489, పీఎల్‌సీ కేసులు 67 పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యా యమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ పలు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకున్నారని, కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. చిన్న తగాదాలను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూ చించారు. అదాలత్‌కు వచ్చిన కక్షిదారులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర, తాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, న్యాయమూర్తులు కే.సాయిశ్రీ, బి. రవికుమార్, వినయ్‌కుమార్, పీవీడీ లక్ష్మి, గోపికృష్ణ, భాగం మాధవరావు, వి.పురుషోత్తమరావు, నిరంజన్‌రావు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.