
కేటీపీఎస్ సొసైటీ ప్రెసిడెంట్‌గా కేశులాల్
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్‌గా నూనావత్ కేశులాల్ నాయక్, జనరల్ సెక్రటరీగా సిద్ది ప్రశాంత్, ట్రెజరర్‌గా వీరమల్లు రఘుకృష్ణ, వైస్ ప్రెసిడెంట్‌గా వల్లమల్ల ప్రకాష్‌లను ఎన్నుకున్నారు. నాలుగు పోస్టులకూ పోటీ ఏర్పడటంతో ఏకగ్రీవం చేసేందుకు తొలుత ప్రయత్నించారు. పోటీ అనివార్యం కావడంతో శనివారం ఉదయం ఎన్నికల అధికారి గంగాధర్, డీఎస్‌ఓ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా, నూతనంగా ఎన్నికై న 13 మంది డైరెక్టర్లు ఓట్లు వేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నూనావత్ కేశులాల్ నాయక్‌కు 9 ఓట్లు, దానం నర్సింహారావుకు 4 ఓట్లు వచ్చాయి. సెక్రటరీ పదవికి పోటీ చేసిన సిద్ది ప్రశాంత్‌కు 10 ఓట్లు, డోలీ శ్రీనివాసరావు 3 ఓట్లు, ట్రెజరర్‌గా పోటీ చేసిన వీరమల్ల రఘుకృష్ణకు 9, బుద్దార్ధి మహేందర్‌కు 4, వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన వల్లమల్ల ప్రకాష్‌కు 9, ధర్మరాజుల నాగేశ్వరరావుకు 4 ఓట్లు వచ్చాయి. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు కేశులాల్ నాయక్, సిద్ది ప్రశాంత్‌లు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకున్న డైరెక్టర్లు