
ట్రెండింగ్‌లో నానో బనానా!
క్షణాల్లో కోరుకున్న ఫొటోలు
ట్రెండింగ్‌గా మారాయి
● నెటిజన్లను ఆకట్టుకుంటున్న త్రీ డీ చిత్రాలు ● సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఫొటోలు
చుంచుపల్లి: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్ రోజురోజూకూ సరికొత్త ఆలోచనలకు తెరలేపుతోంది. గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తోంది. జెమిని 1.0 వెర్షన్‌ను ఇప్పటికే పలు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా, జెమినీ ప్రో, జెమిని నానో బనానా 3డీ ఏఐ వంటి డివైజ్‌ల వరకు అన్నింట్లో పనిచేస్తుంది. వీటి ద్వారా ఇప్పటికే పరిశోధనా పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందిస్తున్నారు. విద్యార్థుల హోంవర్క్‌లోనూ జెమినీ టూల్స్ సాయపడుతున్నాయి. కాగా గూగుల్ జెమిని యాప్‌నకు నానో బనానా సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులోని నానో బనానా 3డీ ఫొటో ఎడిటింగ్ టూల్‌తో అదిరిపోయే త్రీడీ ఫొటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తమ త్రీడీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మురిసిపోతున్నారు. ఈ ఫొటోలకు నెటిజన్లను బాగా ఆకర్షితులవుతున్నారు.
క్షణాల్లో త్రీడీ ఫొటో..
ప్రస్తుతం నానో బనానా ట్రెండ్ నడుస్తోంది. సెకన్ల వ్యవధిలో అద్భుతమైన 3డీ ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు. తొలుత గూగుల్ జెమిని వెబ్‌సైట్/ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ట్రై నానో బనానా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు + అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కావాల్సిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లిష్‌లో క్రియేట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ప్రకారం 3డీ ఇమేజ్ సిద్ధమవుతుంది. ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫొటోను అప్‌లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించాలని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్–సెల్ఫ్ లుక్‌తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్‌లలో ఇది ఒకటి. యాక్షన్ ఫిగర్, వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా ఫొటోలను సృష్టించుకోవచ్చు. నచ్చిన ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా ఫొటో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఇప్పటివరకు 200 మిలియన్ల మంది జెమిని టూల్ ద్వారా 3డీ ఫోటోలు క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నచ్చిన ఫొటోలను రూపొందించుకుంటూ ఆనందపడుతున్నారు.
నానో బనానా 3డీ యాప్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. నేను కూడా అప్‌లోడ్ త్రీడీ చిత్రాలను రూపొందించుకున్నాను. సోషల్ మీడియా పోస్టు చేయడంతో బాగున్నాయని మిత్రులు అభినందించారు.
–చింతల చిరంజీవి, కొత్తగూడెం
ప్రస్తుతం జెమిని ఏఐ నానో బనానా 3డీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన ఫొటోలను రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ 3డీ చిత్రాలు ఊపేస్తున్నాయి.
–మనోజ్‌కుమార్

ట్రెండింగ్‌లో నానో బనానా!