
‘పోడు’పై దాడులు చేయొద్దని..
సూపర్‌బజార్(కొత్తగూడెం): పోడుసాగుదారులపై అటవీశాఖాధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులకు స్వస్తి పలకాలని కోరుతూ సీపీఐ, బీకేఎంయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని నినదించారు. ఈ సందర్భంగా పారీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా మాట్లాడుతూ అనాదిగాసాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అధికారులు కందకాలు తవ్వి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో 200 పనిదినాలు కల్పించాలని, కూలి రూ. 700 చెల్లించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, రేసు ఎల్లయ్య, నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసా ద్, ఎస్‌డీ సలీం, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి నాగయ్య, ఎండీ యూసుఫ్, పి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా