
న్యూఢిల్లీలో సీసీఆర్‌టీ ట్రైనింగ్‌కు ఎంపిక
దుమ్ముగూడెం : మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.మోహన్‌కుమార్ సీసీఆర్‌టీ ట్రైనింగ్‌కు ఎంపికయ్యాడు. మోహన్‌కుమార్ గత మే 25న జరిగిన జిల్లా స్థాయి బెస్ట్ ప్రాక్టీసెస్‌లో జిల్లా నుంచి ఎస్టీటీ కేడర్‌లో నామినేట్ అయ్యాడు. ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ఎస్జీటీ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో రాష్ట్రవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా, వారిలో జిల్లా నుంచి మోహన్‌కుమార్ ఉన్నాడు. వీరికి న్యూ ఢిల్లీలో సీసీఆర్‌టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.