
నీటి సంపులో పడి బాలుడు మృతి
కామేపల్లి: ఆడుకునే క్రమాన ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మండలంలోని పండితాపురానికి చెందిన బాదావత్ నాగరాజు–కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జయరిషినాయక్(2) ఉన్నారు. ఈక్రమాన బుధవారం కవిత ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయిస్తుండగా, జయరిషి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆతర్వాత కుమార్తెలను ఇంట్లోకి తీసుకెళ్లిన క్రమంలో బాలుడు అక్కడే ఆడుతూ నీటి సంపులో పడిపోయాడు. కాసేపటికి రిషి కనిపించడం లేదని వెతుకుతుండగా సంపులో గుర్తించి బయటికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఫోన్ మాట్లాడుతూ బావిలో పడి..
ఖమ్మంఅర్బన్: ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బావిలో పడిన కార్మికుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధీర్ కుమార్(32) ఖమ్మం ఖానా పురంలోని గ్రానైట్‌పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయ న బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సమీప బావలో పడ్డాడు.సమీపంలో ఉన్నవారుబయటకు తీసేలోగా ప్రాణా లు కోల్పోవడంతో ఆయన బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు.