
డబుల్ ఎంట్రీలు లేకుండా జాగ్రత్త వహించాలి
ఇల్లెందురూరల్: వివిధ స్థాయిల్లో బిల్లుల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో ఎంట్రీలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్ సూచించారు. మండలంలో మెడల్ గ్రామంగా ఎంపికై న పూబెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తీరును పరిశీలించారు. బేస్‌మెంట్, రూఫ్ లెవెల్‌కు చేరుకున్న ఇళ్ల లబ్ధిదారులు ఇప్పటివరకు చేసిన ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థాయిలవారీగా సకాలంలో ఎంట్రీలు పూర్తి చేసి త్వరితగతిన బిల్లులు మంజూరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీలో ధన్‌సింగ్, హౌసింగ్ ఏఈ స్వాతి, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.