
కార్పొరేషన్ ఆనవాళ్లు ఏవి..?
● అప్‌గ్రేడ్ అయ్యి రెండు నెలలు.. ● అభివృద్ధివైపు అడుగులు శూన్యం.. ● డివిజన్లలో అపరిష్కృతంగా సమస్యలు ● కోతులు, కుక్కలతో భయాందోళనలో ప్రజలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ఏ–గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా అభివృద్ధిలో ఏమార్పు కనిపించడం లేదు. పేరులో మార్పు వచ్చింది కానీ, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లోని డివిజన్లలో అభివృద్ధిలో ముందడుగు పడలేదు. పాల్వంచ నుంచి వివిధ సెక్షన్లకు సంబంధించిన అధికారులు కొత్తగూడెం కార్పొరేషన్‌కు వచ్చి పనిచేస్తున్నారు. పాల్వంచలో డివిజన్ కార్యాలయం కొనసాగుతుండగా, సుజాతనగర్‌లోని డివిజన్లలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు డివిజన్ల ఇన్‌చార్జ్‌లు గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ప్రజల సౌక ర్యం కోసం కార్పొరేషన్ కార్యాలయం నుంచి యూ డీసీలను నియమించారు. వీరు రోజూ సుజాతనగర్‌లోని డివిజన్లలో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో ఇంతకు మించి ఏం జరుగడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నా రు. డివిజన్లలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయ ని, వాటి పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. కార్పొరేషన్ అయిన తరువాత అందుకు సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్లు కూడా ఇక్క డ కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
డివిజన్లలో అనేక సమస్యలు..
కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లోని డివిజన్ల లో అనేక సమస్యలు నెలకొన్నాయి. అక్కడి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెంనకు సంబంధించి డివిజన్లలో కుక్కలు, కోతుల సంచారం ఎక్కువగా ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ కుక్కలు కరుస్తున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనలు అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేషన్‌లో కుక్కలను పట్టించే కార్యక్రమాలు జరగడం లేదు. రైటర్‌బస్తీ లోని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం మూతబడి ఉండడంతో కుక్కలను సైతం పట్టడం లేదు. ఏబీసీ సెంటర్ తెరిస్తే కుక్కలను పట్టించి వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, గతంలో ఉన్న కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేడయంతో ప్రస్తుతం ఏబీసీ సెంటర్ నిర్వహణ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెంలో ఉదయం, సా యంత్రం వేళల్లో కోతులు ఇళ్లలోని వచ్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎదురుతిరిగితే ప్రజలను గాయపరుస్తున్నాయి. గతంలో మాదిరి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను, కోతులను పట్టించే వారిని తీసుకొచ్చి, పట్టించాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్తతో నిండిన యార్డ్
పాత కొత్తగూడెం ఏరియాలో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోయి ఉంది. యార్డు పక్కనే శ్మశానవాటిక ఉండడంతో ఆ రోడ్డులో కూడా చెత్తాచెదారం వేస్తున్నారు. ఎవరైనా మృతి చెందితే శ్మశానవాటికలోని తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో పాటుగా అక్కడ స్థానికులకు దుర్గంధంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాల్వంచలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
రహదారులు జలమయం..
వర్షం పడితే చాలు రోడ్లన్నీ జలమయం అవుతున్నా యి. రోడ్లలో ఇటీవల వర్షాలు గుంతలు ఏర్పడి అంతర్గత రహదారులన్నీ కూడా దెబ్బతినడడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే సుజాతనగర్‌లోని డివిజన్లలో వీధిలైట్లు లేక ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావడం లేదు. ప్రత్యేక టెండర్లు పిలిచి లైట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. కార్పొరేషన్‌గా మారిన తరువాత చెప్పుకోదగిన అభివృద్ధి పనులు రెండు నెలల కాలంలో ఒక్కటి కూడా జరుగలేదు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..
కార్పొరేషన్‌లో అభివృద్ధిపై దృష్టిసారించాం. ఇప్పడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. పాల్వంచ నుంచి సెక్షన్ ఇన్‌చార్జులు కొత్తగూడెం వచ్చి పని చేస్తున్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
–ప్రసాద్, కార్పొరేషన్ మేనేజర్