అనుమతిలేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌

Aug 7 2025 7:50 AM | Updated on Aug 7 2025 8:04 AM

అనుమత

అనుమతిలేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌

చుంచుపల్లి: జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నందాతండాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీచైతన్య పాఠశాలను బుధవారం ఎంఈఓ బాలాజీ, విద్యాశాఖ సిబ్బంది సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. గతేడాది ఈ పాఠశాలకు మూడు నోటీసులతో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అయినా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాలను కొనసాగిస్తుండటంతో సీజ్‌ చేశామని చెప్పారు.

సైబర్‌ నేరాలపై

అప్రమత్తత అవసరం

టేకులపల్లి: సైబర్‌ దుండగులు ప్రజలు చాకచక్యంగా ముగ్గులోకి దింపి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కాజేస్తారని, ప్రజల్లో అప్రమత్తత అవసరమని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. బుధవారం టేకులపల్లి, లచ్చతండా, సింగ్యాతండా, మూడుతండాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పత్రాలులేని 43 మోటార్‌ సైకి ళ్లు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నాక.. డీఎస్పీ మాట్లాడారు. బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం పిన్‌, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అర్ధరాత్రి తిరగడం, మద్యం సేవించ డం మానేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ లు సత్యనారాయణ, సురేశ్‌, ఎస్‌ఐలు రాజేందర్‌, శ్రీకాంత్‌, సూర్య, నాగుల్‌మీరా, సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో

రాష్ట్ర బృందం పర్యటన

దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం, బి. కొత్తగూడెం గ్రామ పంచాయతీలను రాష్ట్ర బృందం బుధవారం సందర్శించింది. గ్రామాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చేపట్టిన ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, హ్యాండ్‌వా ష్‌ల నిర్మాణాలను పరిశీలించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యు లు, ఎంపీడీఓ వివేక్‌రామ్‌, ఏపీఓ సుకన్య, పంచాయతీ కార్యదర్శులు రాంబాబు, సాయి, స్రవంతి, మంగీలాల్‌, శ్రీకాంత్‌, రాజు, షర్మిల పాల్గొన్నారు.

‘ఏకలవ్య’లో

ఆర్‌సీఓ విచారణ

దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై ఆర్‌సీఓ అరుణకుమారి బుధవారం విచారణ చేపట్టారు. పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారించారు. బాధిత విద్యార్థినిని, ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయుడి నుంచి వివరా లు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారుల కు అందజేయనున్నామని ఆర్‌సీఓ పేర్కొన్నా రు. కాగా,పాఠశాలలో జరిగిన ఘటనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి లేకుండా విద్యార్థినిని విచారించినట్లు సమాచారం.

చదువు మానేసిన వారికి వరంలా ఓపెన్‌ స్కూల్‌

కారేపల్లి: వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారే కాక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్‌స్కూల్‌ ద్వారా చదువు కొనసాగించాలని ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు సూచించారు. కారేపల్లి ఐకే పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుతో కలిసి ఐకేపీ సీసీలు, గ్రామ దీపికలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్‌ మాట్లాడుతూ చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న సభ్యులు పదో తరగతి, ఇంటర్‌ చదివే అవకాశముందని తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశమున్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఐకేపీ సీసీలు అనిల్‌కుమార్‌, పుష్పకుమారి, సోందు, గౌసియా బేగం, విజయలక్ష్మి, అకౌంటెంట్‌ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అనుమతిలేని  ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌1
1/2

అనుమతిలేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌

అనుమతిలేని  ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌2
2/2

అనుమతిలేని ప్రైవేట్‌ పాఠశాల సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement