
ఎస్పీని కలిసిన రిటైర్డ్ పోలీసులు
కొత్తగూడెంటౌన్: జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎస్పీ రోహిత్‌రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న సంఘం నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చారు. వారిలో నూతన అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు అశోక్‌కుమార్, చీఫ్ అడ్వైజర్ ఎస్‌ఎం అలీ, అడ్వైజర్‌గా సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్లు బి.తారాసింగ్, కె.శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరి కె.శివశంకర్‌రావు, జాయింట్ సెక్రటరి వి.వెంకయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎంఏ హాకీం, బి.శ్రీనివాసరావు, బి.రాంజీ, జి.అప్పారావు, ఎస్‌కే జానీమియా తదితరులు ఉన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం
అశ్వారావుపేటరూరల్: ఓ ఎస్‌బీ కానిస్టేబుల్ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిన ఘటన బుధవారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామాలయం వీధిలోని సూపర్‌మార్కెట్ వద్ద.. ఎస్‌బీ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ విధుల్లో భాగంగా కారులో వచ్చి.. ప్రధాన రహదారిపైనే పార్కింగ్ చేశాడు. అటువైపు వస్తున్న ఓ ట్రాక్టర్‌ను ఆపి వివరాలు సేకరించాడు. రోడ్డుపై అడ్డుగా ఉన్న కారుతోపాటు ఇసుక ట్రాక్టర్ కూడా ఆగిపోవడంతో ఈ మార్గంలో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిత్యం వాహనాల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. ఇలాంటి రద్దీ ప్రాంతంలో కానిస్టేబుల్ అనాలోచితంగా కారును పార్కింగ్ చేసి వాహనదారులను ఇబ్బందులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక ఎస్‌ఐ యయాతిరాజును వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా రామవరం 2 ఇంక్‌లైన్‌లో సింగరేణి మాజీ ఉద్యోగి కోలపూరి తులసీరామ్ (62) మంగళవారం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్ద కుమార్తె ప్రవళ్లిక బుధవారం తలకొరివి పెట్టింది.
దాడి చేసిన వ్యక్తిపై కేసు
పాల్వంచరూరల్: చందా అడిగిన వెంటనే ఇవ్వలేదనే కోపంతో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సంగం గ్రామానికి చెందిన కస్కూరి సాయిదుర్గాప్రసాద్ మంగళవారం రోడ్డుపై నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన బి.ఏసు వచ్చి వనదేవతల పండగకు చందా ఇవ్వాలని కోరాడు. తన వద్ద ఇప్పడు డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాయిదుర్గాప్రసాద్‌పై ఏసు కర్రతో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం ఏసుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

ఎస్పీని కలిసిన రిటైర్డ్ పోలీసులు