
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలోని విజయ డెయిరీ యూనిట్‌ను మంగళవా రం ఉదయం పరిశీలించనున్న మంత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత ఖమ్మం 15వ డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక బుధవా రం కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
గూడ్స్ రైలు నుంచి
విడిపోయిన బోగీలు
కారేపల్లి: లింక్ ఊడిపోవడంతో గూడ్స్ రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి స్టేషన్ సమీపాన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. డోర్నకల్ జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా ఖాళీ బోగీలతో గూడ్స్ రైలు కొత్తగూడెం వైపు వెళ్తోంది. గేటుకారేపల్లి స్టేషన్ సమీపానికి వచ్చేసరికి కొన్ని బోగీలకు లింగ్ ఊడిపోయింది. దీంతో కొన్ని బోగీలను వదిలేసి ఇంజిన్ ఇంకొన్ని బోగీలతో వెళ్తుండడాన్ని గేటుకారేపల్లి, అనంతారం గేట్‌మెన్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్‌ను అప్రమత్తం చేసి గూడ్స్ రైలును నిలిపివేయగా, ఆతర్వాత సిబ్బంది చేరుకుని ఊడిపోయిన బోగీలను మరో ఇంజన్ సాయంతో తీసుకొచ్చి జత చేశారు. దీంతో అరగంట తర్వాత గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ఇదే సమయాన గేటుకారేపల్లి, అనంతారం గేట్లను మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పిడుగుపాటుతో
మహిళ మృతి
పినపాక: పొలంలో వరి నాటు వేస్తుండగా పిడుగు పడి మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బోటుగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరం రమణ (55) తోటి కూలీలతో వరి పొలంలో నాటు వేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పని ప్రదేశంలోనే పిడుగుపడగా కుప్పకూలిన రమణను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.
çÜ$gê™èl¯]lVýSÆŠḥË 13 Ðól$MýS-Ë$..
సుజాతనగర్: పిడుగుపాటుతో 13 మేకలు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన కేసుపాక పుల్లయ్య మేకలను మేత కోసం రాఘవాపురం రోడ్డు పక్కన గల జామాయిల్ తోటలోకి తీసుకెళ్లాడు. అయితే భారీ వర్షం కురవడంతో పాటు మేకలపైనే పిడుగు పడడంతో అవి అక్కడికక్కడే మృతిచెందాయి. జీవనాధారమైన మేకల మరణంతో తనకు సుమారు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారిం అందించాలని పుల్లయ్య వేడుకున్నాడు. కాగా, మేకల కాపరి పుల్లయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కుమారి హనుమంతరావు, కాంగ్రెస్ ఫార్టీ మండల కార్యదర్శి చింతలపూడి శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన