
మద్యానికి బానిసైన వ్యక్తి మృతి
పినపాక: మద్యానికి బానిసైన వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని తోగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇర్ఫా నరేష్(35) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కట్టెల కోసం వెళ్లి తిరిగి వచ్చి మద్యం సేవించి తన పాత ఇంట్లో పడుకున్నాడు. మద్యం సేవించినప్పుడల్లా తిరుగుతుంటా డని భావించిన కుటుంబసభ్యులు సాయంత్రం వరకు వెదికి వదిలేశారు. కాగా, పాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నరేష్ మృతిచెందినట్లు గుర్తించారు. తండ్రి బిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు.
బీరప్ప ఆలయంలో చోరీ
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని పెంట్లంగ్రామంలో గల బీరప్ప ఆలయంలో ఆదివా రం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆల య కమిటీ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సీహెచ్ చంద్రశేఖర్ సోమవారం సిబ్బందితో కలిసి ఘటనస్థలాన్ని పరిశీలించా రు. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమా రు రూ.10వేల నగదు అపహరించుకెళ్లారని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి మృతదేహం లభ్యం
వేంసూరు: ఏపీలోని వాడపల్లిలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పామర్తి సాయిదినేష్ ఈనెల 19న స్నేహితులతో కలిసి వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లగా అక్కడ గోదావరిలో గల్లంతయ్యాడు. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలు గాలిస్తుండడంగా సోమవారం మృతదేహం లభించడంతో కుటుంబీకులకు అప్పగించారు.