
‘సీతారామ’ జలాలు విడుదల
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఒక మోటారు ద్వారా శని వారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్‌చేసి విడుదల చేశారు. నాగార్జుసాగర్ ఎడమ కాలు వ ఆయకట్టులో తీవ్ర నీటి సమస్య నెలకొని నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ సమస్యను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరిలో 8లక్షల క్యూసెక్కుల జలాలు డిశ్చార్జ్ అవుతున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు పంప్‌హౌస్ నుంచి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు. కాగా గోదావరి జలాలు ఇక్కడి నుంచి ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) ద్వారా ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు తరలనున్నాయి. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, ఓరుగంటి రమేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
మోటారు స్విచాన్ చేసిన
పినపాక ఎమ్మెల్యే పాయం

‘సీతారామ’ జలాలు విడుదల