
తాత్కాలిక పద్ధతులను ప్రోత్సహించాలి
కొత్తగూడెంఅర్బన్: కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను ప్రోత్సహించాలని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి జయలక్ష్మి సూచించారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని మొర్రేడువాగు బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలని చెప్పారు. మహిళల పోషక స్థితిని మెరుగుపరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మధువరన్, యు. తేజశ్రీ , ఫైజ్‌మోహియుద్దీన్, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.