
బాలుడిని రక్షించిన వైద్యులు
భద్రాచలంఅర్బన్: కరకగూడెం మండలంలో పద్మాపురం గ్రామానికి చెందిన రెండున్నర ఏళ్ల బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ప్రాణాపాయం నుంచి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సారయ్య, నాగమణి దంపతులు తమ కుమారుడు విక్రమాధిత్యను ఓ విషపురుగు కాటేసిందని మంగళవారం సాయంత్రం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండి, నోటి నుంచి నురగలు కక్కుతున్నాడు. కాటేసిన ఆనవాళ్లు లేకపోవడంతో వైద్యులు కొంత సందేహించినప్పటికీ, 8 గంటల పాటు శ్రమించి తేలు, పాము కాటుకు అందించే చికిత్స అందించారు. బాలుడు కోలుకోవడంతో బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేసినట్లు ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలుడిని రక్షించేందుకు కృషి చేసిన వైద్యులు రజశేఖర్‌రెడ్డి, కై లాష్‌మోహన్‌ను ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు.