
కుల బహిష్కరణ అవాస్తవం
ఇల్లెందురూరల్: మండలంలోని పాతపూసపల్లిలో పలువురిని కుల బహిష్కరణ చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రామపెద్దలు వర్స అవినాష్, సూర్నపాక వెంకటనారాయణ, తెల్లం శ్యాం, కుంజ వీరస్వామి, వర్స పుల్లయ్య స్పష్టం చేశారు. గ్రామంలో బుధవా రం వారు మాట్లాడుతూ.. తమపై ఆరోపణలు చేసిన వ్యక్తులు కొత్తపూసపల్లి వాసులని, గ్రామంతో సంబంధం లేని వ్యక్తులను తాము కుల బహిష్కరణ చేశామని ఆరోపించడం గర్హనీయమన్నారు. గతంలో తమ గ్రామంలో పార్టీ విస్తరణకు సీపీఎం నేతలు ప్రయత్నిస్తే తిరస్కరించగా, కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తమపై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో గ్రామస్తులు సూర్నపాక రామారావు, ఈసం కృష్ణ, సూర్నపాక సుజాత, సోది మహేశ్, కల్తి వినోద్, సూర్నపాక సత్యనారాయణ, సోది హరీశ్, కుంజ సందీప్, కుంజ మోహన్, వర్స ఆనంద్, కల్తి సోమయ్య, గుమ్మ డి గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, లక్ష్మీదేవిపల్లి పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.39,530 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కార్తీక్ తెలిపారు.
మొక్కలు నాటి రక్షించాలి
టీజీఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య
చుంచుపల్లి: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ఇందుకోసం మొ క్కలు నాటి సంరక్షించాలని టీజీ ఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం కొత్తగూడెం, పాల్వంచ డివి జన్ కార్యాలయంలో అటవీ అధి కారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు. మానవాళికి ప్రాణవా యువు అందించే మొక్కల పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ, ఇతర ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ఎఫ్‌డీ ఓ కోటేశ్వరరావు, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డీఎంలు చంద్రమోహన్, కవిత, గణేష్, డీఆ ర్‌ఓ తోలెం వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, చారి పాల్గొన్నారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దు
పాల్వంచ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణా పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ పిలుపు మేరకు కేటీపీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో 5, 6, 7 దశల కర్మాగారాల ఎదుట వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేఏసీ నాయకులు డి.ఉమా మ హేశ్వరరావు, కోటేశ్వరరావు, డోలీ శ్రీనివాసరా వు, అఖిలేష్, పుల్లారావు, కోటేశ్వరరావు, రవీందర్, పరుశురాం, సురేంద్రాచారి, వెంకటేశ్వర్లు, నా గేశ్వరరావు, శ్రీనివాసరావు, సీతారాంరెడ్డి, జయభాస్కర్, శ్రీపాల్, పావని, రజిత పాల్గొన్నారు.

కుల బహిష్కరణ అవాస్తవం