
విద్యుత్ కోతలపై ఆందోళన
జూలూరుపాడు: అప్రకటిత విద్యుత్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భేతాళపాడు గ్రామస్తులు జూలూ రుపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నరకయాతన పడుతున్నామని అన్నారు. రాత్రి వేళలో ఏ కొద్దిపాటి వర్షం కురిసినా కరెంట్ పోతుందని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీధర్, మండల కార్యదర్శి యాసా నరేష్‌లు సంఘీభావం తెలి పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని జూలూరుపాడు విద్యుత్‌శాఖ ఇన్‌చార్జి ఏఈ నరసింహారావు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డిబోయిన గోవిందు, శ్రీను, చలమల నరసింహారావు, రెడ్డిబోయిన నవీన్, చౌడం సాయికుమార్, ధరావత్ బాల కిషన్, నాగభూషణం, గుగులోత్ భాస్కర్, బానోత్ సుగుణరావు, వెంకటేష్, రేగళ్ల సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.